AAP: మాన్ దూకుడు.. పంజాబ్‌లో 35 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బద్ధీకరణ

punjab cm regularises the services of 35000 contract employees
  • ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల అమలులో మాన్
  • ఇప్ప‌టికే ఉద్యోగాల భ‌ర్తీపై ప్ర‌క‌ట‌న‌
  • తాజాగా కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బద్ధీకరణ ‌

పంజాబ్ సీఎం కుర్చీలో కూర్చున్న మ‌రుక్ష‌ణ‌మే ఆప్ నేత భ‌గ‌వంత్ మాన్ దూకుడుగా సాగుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల అమ‌లుపై దృష్టి సారించిన ఆయ‌న ఇప్ప‌టికే కొత్త ఉద్యోగాల భ‌ర్తీ కోసం కీలక ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా అవినీతిపై ఫిర్యాదుల‌కు ఏకంగా వాట్సాప్ నెంబ‌ర్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా కూడా మాన్ ప్ర‌క‌టించారు. తాజాగా మ‌రో హామీని అమ‌లు చేస్తూ మాన్ మంగ‌ళ‌వారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ప‌లు ప్ర‌భుత్వ శాఖల్లో గ్రూప్ సి, గ్రూప్ డి కేట‌గిరీల్లో కాంట్రాక్టు పద్ధతిన ప‌నిచేస్తున్న 35 వేల మంది ఉద్యోగుల‌ స‌ర్వీసుల‌ను రెగ్యుల‌రైజ్ చేస్తున్న‌ట్టు భ‌గ‌వంత్ మాన్ మంగ‌ళ‌వారం ప్రకటించారు. 'మ‌రో రోజు మ‌రో ఎన్నిక‌ల హామీ అమ‌లు' అన్న క్యాప్ష‌న్‌ను పోస్ట్ చేస్తూ దాని కిందే హామీ అమ‌లు వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ మాన్ ఓ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News