Raghu Rama Krishna Raju: పెగాసస్‌ అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి కారణం ఇదే: రఘురామకృష్ణ రాజు

Pegasus issue raised to cover cheap liquor deaths says Raghu Rama Krishna Raju
  • కల్తీ సారా తాగి చనిపోతే సహజ మరణాలు అంటున్నారు
  • కల్తీ మద్యం బ్రాండ్లపై ప్రధాని, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి లేఖలు రాశా
  • కల్తీ సారా మరణాల నుంచి దృష్టి మళ్లించడానికే పెగాసస్ అంశమన్న రఘురామ 
జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి పెద్ద సంఖ్యలో జనాలు చనిపోవడంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కల్తీ సారా తాగి చనిపోతే సహజ మరణాలు అని చెప్పడం దారుణమని అన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పారు. 

రాష్ట్రంలో అమ్ముతున్న కల్తీ మద్యం బ్రాండ్లపై ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రులకు గతంలోనే లేఖలు రాశానని తెలిపారు. కల్తీ మద్యంపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కల్తీ సారా మరణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే పెగాసస్ ను తెరపైకి తెచ్చారని అన్నారు. ఏపీ అసెంబ్లీలో బూతులు మాట్లాడటం తప్ప, ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని మండిపడ్డారు.
Raghu Rama Krishna Raju
YSRCP
Pegasus

More Telugu News