Pavan Kalyan: దసరాకి థియేటర్లలో దిగనున్న 'వీరమల్లు'

  • 'వీరమల్లు'గా పవన్ కల్యాణ్
  • మొగల్ కాలంనాటి కథ 
  • నెక్స్ట్  షెడ్యూల్ కి సన్నాహాలు 
  • అక్టోబర్ 5వ తేదీన విడుదల
Hari Hara Veera Mallu movie update

పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్లో 'హరి హర వీరమల్లు' సినిమా రూపొందుతోంది. ఎ.ఎమ్. రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొగల్ చక్రవర్తుల కాలంలో నడిచే కథ ఇది. అందువలన ఆ కాలం నాటి కట్టడాల సెట్స్ కోసం భారీ మొత్తాన్నే ఖర్చు చేస్తున్నారు. కథానాయికగా నిధి అగర్వాల్ అలరించనుంది.

50 శాతం వరకూ చిత్రీకరణ జరిగిన తరువాత కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. డిసెంబరులోనే మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి ప్రయత్నించినా కుదరలేదు. త్వరలోనే షూటింగును మొదలు పెట్టి సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తిచేయాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు.

ఇక ఈ సినిమాను విజయదశమి కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. దాదాపు ఇదే తేదీ ఖరారు కావొచ్చని సమాచారం. కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా తరువాత 'భవదీయుడు భగత్ సింగ్' కోసం హరీశ్ శంకర్ తో కలిసి పవన్ సెట్స్ పైకి వెళ్లనున్నారు.

More Telugu News