KTR: హైద‌రాబాద్‌లో 'కెమ్ వేద' సెంట‌ర్‌.. రూ.150 కోట్ల పెట్టుబ‌డి

  • ఆర్అండీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేయ‌నున్న కెమ్ వేద‌
  • ఈ సెంట‌ర్‌తో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రీసెర్చీ మ‌రింత బ‌లోపేతం
  • అమెరికా పర్య‌ట‌న‌లో మంత్రి కేటీఆర్ వెల్ల‌డి
chem veda life sciences will open its r and d center in hyderabad

తెలంగాణ‌కు మ‌రిన్ని పెట్టుబ‌డుల సాధ‌నే ల‌క్ష్యంగా అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన తెలంగాణ మంత్రి కేటీఆర్ రెండు రోజుల‌కే ఓ సంస్థ రాష్ట్రానికి వ‌చ్చేలా చేశారు. హైద‌రాబాద్‌లో రూ.150 కోట్ల పెట్టుబ‌డితో త‌న సెంట‌ర్‌ను ఏర్పాటు చేసేందుకు కెమ్ వేద లైఫ్ సైన్సెస్ అంగీక‌రించింది. హైద‌రాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఆ సంస్థ ఏర్పాటు చేయనుంది.

 హైదరాబాద్‌లో ఇప్ప‌టికే పాతుకుపోయిన ఫార్మా లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఈకో సిస్టంను కెమ్ వేద లైఫ్ సైన్సెస్ సెంట‌ర్ మరింత బలోపేతం చేస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ ఫార్మాసిటీలో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని ప్రఖ్యాత పరిశోధన సంస్థ స్క్రిప్స్ ను కోరిన‌ట్టు కేటీఆర్ చెప్పారు. త‌మ ప్ర‌తిపాద‌న‌కు ఆ సంస్థ కూడా సానుకూలంగానే స్పందించింద‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News