Santhaiah: ఇలాంటి సంతకం ఇంకెక్కడా ఉండదు... ఇంతకంటే ఇంకేం చెప్పలేం: కర్ణాటక అధికారి సంతకానికి యునెస్కో ఫిదా

  • కర్ణాటకలో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న శాంతయ్య
  • చిత్రవిచిత్రమైన మెలికలతో సంతకం
  • యునెస్కో దృష్టికి శాంతయ్య సిగ్నేచర్
  • సోషల్ మీడియాలో వైరల్
UNESCO appreciates Karnataka official signature very special

పూర్తి పేరును సంక్షిప్తంగా సంతకంలో పొందుపరుస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఒక్కొక్కరి సంతకం ఒక్కోలా ఉంటుంది. కర్ణాటకలోని హోనావర్ ప్రాంతానికి చెందిన శాంతయ్య అనే అధికారి సంతకం మాత్రం ఎంతో విలక్షణం అని చెప్పాలి. 

శాంతయ్య సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నారు. శాంతయ్య పూర్తి పేరు కొంపల్ సోమపుర శాంతయ్య. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నది. అందుకే, తన సంతకం విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. మరెవరూ తన సంతకం ఫోర్జరీ చేసేందుకు వీలు లేకుండా, ఎంతో కష్టపడి, సంక్లిష్టమైన రీతిలో సంతకం చేయడం అలవర్చుకున్నారు. 

శాంతయ్య సంతకం కర్ణాటకకే కాదు ఐక్యరాజ్యసమితి సంస్థ యునెస్కో వరకు పాకింది. ఇంతకంటే అద్భుతమైన సంతకం ప్రపంచంలో మరెక్కడా ఉండదు, ఎవరూ చేయలేరంటూ యునెస్కో సైతం శాంతయ్యకు కితాబునిచ్చింది. గతంలో ఓ హైకోర్టు జడ్జి కూడా శాంతయ్య సంతకం చూసి ఆశ్చర్యపోయారట. ప్రత్యేకంగా శాంతయ్యను ఇంటికి పిలిపించుకుని అభినందించి పంపారట. ఇప్పుడు శాంతయ్య సంతకంతో పాటు, మరికొన్ని విచిత్రమైన సంతకాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More Telugu News