Gamblers: ఏపీ-కర్ణాటక సరిహద్దులో పేకాట స్థావరాలపై దాడులు... అరెస్టయిన వారిలో బాలకృష్ణ పీఏ!

Police arrests gamblers in AP and Karnataka border
  • నగరిగేర ప్రాంతంలో జోరుగా పేకాట
  • పక్కా సమాచారంతో పోలీసుల దాడులు
  • 19 మంది అరెస్ట్
  • అరెస్టయిన వారిలో వైసీపీ నేతలు!
ఏపీ-కర్ణాటక సరిహద్దుల్లో పేకాట జోరుగా సాగుతోందన్న సమాచారంతో కర్ణాటక పోలీసులు దాడులు నిర్వహించారు. నగరిగేర ప్రాంతంలో 19 మంది రాజకీయ ప్రముఖులు, ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో హిందూపురం రాజకీయనేతలతో పాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీ కూడా ఉన్నట్టు సమాచారం. అరెస్టయిన నేతలు వైసీపీకి చెందినవారిగా భావిస్తున్నారు. హిదూపురం వైసీపీ కన్వీనర్ శ్రీరామ్ రెడ్డి కూడా అరెస్టయ్యారు. అరెస్టయిన వారిని పోలీసులు చిక్కబళ్లాపూర్ కోర్టులో హాజరుపరిచారు.
Gamblers
Arrest
Nagarigera
AP-Karnataka Border

More Telugu News