TRS: ది క‌శ్మీర్ 'ఫైల్స్‌'పై కేసీఆర్ విసుర్లు!

  • ది క‌శ్మీర్ ఫైల్స్ ఎవ‌రు కోరారు?
  • అస‌లు అందులో ఏముంది?
  • ఇరిగేష‌న్ ఫైల్స్, ఎక‌న‌మిక్ ఫైల్స్ ఉండాలి
  • టీఆర్ఎస్ఎల్పీ భేటీ త‌ర్వాత మీడియాతో కేసీఆర్
kcr satires on the kashmir files movie

క‌శ్మీర్‌లో క‌శ్మీరీ పండిట్ల‌పై జ‌రిగిన అకృత్యాల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ది క‌శ్మీర్ ఫైల్స్ చిత్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌దైన శైలి సెటైర్లు సంధించారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స‌హా బీజేపీ నేతలంతా ఈ చిత్రంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు ఈ చిత్రానికి వినోద ప‌న్ను రాయితీ కూడా ఇచ్చాయి. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను కూడా అందుకుంటూ ఈ చిత్రం స‌రికొత్త రికార్డుల దిశ‌గా సాగుతోంది. 

సోమ‌వారం నాడు టీఆర్ఎస్ఎల్పీ భేటీ ముగిసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించిన కేసీఆర్‌.. ది క‌శ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఆస‌రాగా చేసుకుని కూడా త‌న‌దైన శైలి దాడి కొన‌సాగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ .  "ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ఏముంది? అభివృద్ధి కాంక్షించే ప్ర‌భుత్వం ఉన్న‌ట్లైతే.. ఇరిగేష‌న్ ఫైల్స్‌, ఎక‌న‌మిక్ ఫైల్స్ ఉండాలి. ద క‌శ్మీర్ ఫైల్స్ ను ఎవ‌రు కోరారు? ఈ చిత్రాన్ని ఓట్ల కోస‌మే వాడుకుంటున్నార‌ని ఢిల్లీలో కొంద‌రు క‌శ్మీరీ పండిట్లు చెబుతున్నారు. ఇప్ప‌టిదాకా త‌మ‌కు ఎలాంటి లబ్ధి చేకూర‌లేద‌ని కూడా వారు ఆరోపిస్తున్నారు" అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

More Telugu News