CPI Ramakrishna: జగన్ ప్రభుత్వం గాలికి కొట్టుకుపోయింది.. పోలీసులే రాజ్యమేలుతున్నారు: సీపీఐ రామకృష్ణ

  • జనాల ఇళ్లకు వెళ్లి పోలీసులు దాడి చేస్తున్నారు
  • సీపీఐ నాయకులను కొట్టడాన్ని ఖండిస్తున్నాం
  • ఎస్సై మునిప్రతాప్ ను విధుల నుంచి తొలగించాలి
CPI Ramakrishna fires on police

ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం గాలికి కొట్టుకుపోయిందని... ప్రభుత్వంలో పోలీసులే రాజ్యమేలుతున్నారని అన్నారు. పోలీస్ యూనిఫామ్ ఇచ్చింది దౌర్జన్యాలు చేయడానికి కాదని చెప్పారు. జనాల ఇళ్లకు వెళ్లి పోలీసులు దాడి చేస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 

సీపీఐ నాయకులను కొట్టడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. స్టేషన్ కు వెళ్లి న్యాయం అడిగితే బట్టలు ఊడదీసి కొట్టడం దారుణమని అన్నారు. పోలీసు దాడిలో గాయపడిన బాధితులను ఆదోని ఆసుపత్రిలో రామకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సై మునిప్రతాప్ ఉద్యోగంలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. మునిప్రతాప్ ను వెంటనే  విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు చంపే పనులను కూడా మొదలు పెట్టారని అన్నారు.

More Telugu News