Samantha: నాగ చైతన్యను అన్ ఫాలో చేసిన సమంత

Samantha unfollows Naga Chaitanya in Instagram
  • ఇన్స్టాగ్రామ్ నుంచి అన్ ఫాలో చేసిన సమంత
  • ఇప్పటికే చైతూ ఫొటోలను తొలగించిన వైనం
  • ఇప్పటికీ సమంతను ఫాలో అవుతున్న చైతూ
టాలీవుడ్ అందమైన జంటగా పేరుగాంచిన నాగ చైతన్య, సమంతలు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఎందుకు విడిపోయారనే సంగతి ఇప్పటికీ ఎవరికీ తెలియదు. విడిపోవడానికి గల కారణం ఏమిటనేది వీరిద్దరిలో ఎవరూ వెల్లడించలేదు. 

మరోవైపు ఇన్స్టాగ్రామ్ లో నాగ చైతన్యను సమంత అన్ ఫాలో చేసింది. ఇప్పటికే తన ఖాతా నుంచి నాగ చైతన్య ఫొటోలను సమంత డిలీట్ చేసింది. అయితే, నాగ చైతన్య బంధువులైన వెంకటేశ్, రానా, నాగార్జున, వెంకటేశ్ కూతురు అశ్రితలను మాత్రం సమంత అన్ ఫాలో చేయలేదు. మరోవైపు సమంతను ఇప్పటికీ నాగ చైతన్య ఫాలో అవుతూనే ఉన్నాడు. అంతేకాదు సమంతతో కలిసి ఉన్న ఫొటోలను కూడా డిలీట్ చేయలేదు.
Samantha
Naga Chaitanya
Instagram
Tollywood

More Telugu News