Vijayasai Reddy: చెక్కలతో ట్రెడ్ మిల్ చేసిన శ్రీనివాస్ కు అభినందనలు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy appreciates the craftsman who made wooden tredmill
  • తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఘనత
  • చెక్కలతో ట్రెడ్ మిల్ కు రూపకల్పన
  • ఇటీవలే కేటీఆర్ సైతం అచ్చెరువొందిన వైనం
  • తాజాగా అభినందనలు తెలిపిన విజయసాయి
ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ వ్యక్తి చెక్కలతో ట్రెడ్ మిల్ తయారుచేయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ ట్రెడ్ మిల్ అచ్చంగా యాంత్రిక ట్రెడ్ మిల్ లానే పనిచేస్తుండడం పట్ల కేటీఆర్ అచ్చెరువొందారు. తాజాగా, ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పంచుకున్నారు. 

మన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వడ్రంగి కళాకారుడు కడిపు శ్రీనివాస్ ఎంతో వైవిధ్యంగా ఆలోచించి చెక్కలతో ట్రెడ్ మిల్ రూపొందించాడని, అందరినీ అబ్బురపరుస్తున్నాడని కొనియాడారు. శ్రీనివాస్ నైపుణ్యానికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. వైవిధ్యంగా ఏదైనా చేయాలన్న తలంపు ఉంటే చాలు గుర్తింపు దానంతట అదే వస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Vijayasai Reddy
Srinivas
Wooden Tredmill
East Godavari District
Andhra Pradesh

More Telugu News