PM Modi: భారత ప్రజల తరఫున ఆస్ట్రేలియా ప్రధానికి ధన్యవాదాలు చెప్పిన మోదీ

  • కళాఖండాలను అప్పగించినందుకు మోదీ కృతజ్ఞతలు
  • ద్వైపాక్షిక సంబంధాల పురోగతి పట్ల ఆశాభావం
  • ప్రాంతీయ సహకారం ప్రాధాన్యాన్ని గుర్తు చేసిన స్కాట్ మారిసన్
On behalf of Indians I thank you PM Modi to Australian PM for returning smuggled artefacts

భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక శిఖరాగ్ర భేటీ వర్చువల్ గా సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ముందు ప్రధాని మోదీ 'నమస్కార్'తో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ను పలకరించారు. భారత్ కు చెందిన విలువైన కళాకృతులను తిరిగి అప్పగించినందుకు భారత ప్రజల తరఫున ఈ సందర్భంగా ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. 


ఇవన్నీ కూడా రాజస్థాన్, పశ్చిమబెంగాల్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందినవి. అక్రమంగా ఆస్ట్రేలియాకు చేరిన వీటిని అక్కడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో వాటిని ఆ దేశం తాజాగా భారత్ కు అప్పగించింది. 

‘‘ఏటా ద్వైపాక్షిక సమావేశాలు జరిగేలా యంత్రాంగాన్ని నేడు ఏర్పాటు చేసుకోవడం ద్వారా భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతాయి. మన బంధాలను క్రమం తప్పకుండా సమీక్షించుకునేందుకు వీలుగా నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటుపై ఇది దృష్టి పెడుతుంది. 

గత కొన్నేళ్లలో మన బంధం ఎంతో బలోపేతం అయింది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, విద్య, ఆవిష్కరణలు, సైన్స్, టెక్నాలజీ తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారం ఏర్పాటైంది’’అని మోదీ గుర్తు చేశారు. క్వీన్స్ లాండ్, న్యూ సౌత్ వేల్స్ లో వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడడం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. 

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం అంశాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రస్తావనకు తెచ్చారు. ఈ పరిమాణాల నేపథ్యంలో ప్రాంతీయంగా ఎదురయ్యే సవాళ్లపై చర్చించేందుకు అవకాశం లభించిందంటూ.. ప్రాంతీయ సహకారానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు.

More Telugu News