Anil Kumar Yadav: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేం ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాం.. మీకు ఆ దమ్ముందా?: టీడీపీకి మంత్రి అనిల్ సవాల్
- శాసన మండలిలో మాట్లాడిన అనిల్
- టీడీపీ ఒంటరిగా దిగుతామని ప్రకటించాలి
- పొత్తు లేకుండా పోతామని చెప్పగలరా?
- టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తోందన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో టీడీపీ నేతలపై మంత్రి అనిల్ మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని చెప్పారు. టీడీపీ కూడా ఒంటరిగా పోటీచేస్తుందని ప్రకటించగలదా? అని ఆయన సవాలు విసిరారు. టీడీపీకి అంత దమ్ము ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
టీడీపీలో కనీసం ఒక్క నాయకుడయినా పొత్తు లేకుండా పోతామని చెప్పగలరా? అని ఆయన నిలదీశారు. ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతోన్న టీడీపీ తమపై అనవసర ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాగా, శాసన మండలిలోనూ టీడీపీ నేతల నిరసన కొనసాగింది. రాష్ట్రంలో కల్తీ సారా అమ్మకాలపై లోకేశ్ మండిపడ్డారు.