Tim Southee: ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ప్రియురాలిని పెళ్లాడిన టిమ్ సౌథీ

Tim southee married his lover after having two kids
  • ప్రియురాలు బ్రయాను పెళ్లి చేసుకున్న క్రికెటర్ సౌథీ
  • చాలా ఏళ్లుగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న జంట
  • ఐపీఎల్ లో కేకేఆర్ కు ఆడుతున్న సౌథీ
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ టిమ్ సౌథీ ఎట్టకేలకు తన ప్రియురాలు బ్రయాను పెళ్లి చేసుకున్నాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఎన్నో ఏళ్లుగా వీళ్లిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. వీరిద్దరికీ ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2017లో వీరికి ఇండీ మే సౌథీ, 2019లో స్లోయానే అవా సౌథీ జన్మించారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 

న్యూజిలాండ్ తరపున 85 టెస్టు మ్యాచులు ఆడిన సౌథీ 338 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లో కూడా రాణించి 5 హాఫ్ సెంచరీలతో 1,769 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు సౌథీని రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకుంది.
Tim Southee
New Zealand
Marriage

More Telugu News