Punjab: అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలో రాజ‌మౌళి, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌.. వీడియోలు ఇవిగో

raja mouli visits golden temple
  • రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' 
  • విడుదలకు సిద్ధ‌మ‌వుతోన్న సినిమా
  • ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో సినీ బృందం
రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదలకు సిద్ధ‌మ‌వుతోన్న విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చరణ్ బిజీగా ఉంటున్నారు. ప‌లు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పంజాబ్‌, అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో సిక్కు మ‌త సంప్ర‌దాయాల ప్ర‌కారం ఎన్టీఆర్, చెర్రీ, రాజ‌మౌళి పూజ‌ల్లో పాల్గొన్నారు. 

                                 
ఇందుకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కూడా నటించారు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత రాజ‌మౌళి నుంచి వ‌స్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఈ నెల 25న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టించారు.
Punjab
RRR
Ramcharan
Rajamouli
Junior NTR

More Telugu News