Allu Arjun: చిరంజీవి సమక్షంలో అల్లు అర్జున్ కు ఘన సత్కారం.. పార్టీ ఇచ్చిన బన్నీ మామగారు!

Allu Arjun father in law felicitated him in front of Chiranjeevi
  • ఘన విజయం సాధించిన 'పుష్ప'
  • పార్క్ హయత్ లో చంద్రశేఖర్ రెడ్డి విందు 
  • పార్టీకి హాజరైన చిరంజీవి దంపతులు

అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. హిందీలో సైతం ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. బాక్సాఫీసును కొల్లగొట్టింది. హిందీలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగాడు. మరోవైపు అల్లు అర్జున్ తో ఒక భారీ చిత్రాన్ని నిర్మించేందుకు బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ సిద్ధమయ్యారు. 

మరోవైపు 'పుష్ప' ఘన విజయం సాధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ మామగారు చంద్రశేఖర్ రెడ్డి (భార్య స్నేహారెడ్డి తండ్రి) హైదరాబాదులోని పార్క్ హయత్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి చిరంజీవి, ఆయన భార్య సురేఖ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన అల్లుడు బన్నీని చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ పార్టీకి అల్లు అరవింద్ దంపతులు, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీశ్ శంకర్, క్రిష్ జాగర్లమూడి, గుణశేఖర్ తదితరులు హాజరైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News