pegasus: చంద్రబాబు పెగాసస్‌ను వాడారని మమతా బెన‌ర్జీ స్పష్టంగా చెప్పారు: అసెంబ్లీలో మంత్రి బుగ్గ‌న‌

discussion on pegasus in ap assembly
  • అసెంబ్లీలో పెగాసస్‌ అంశంపై చర్చ జ‌ర‌గాలి
  • ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుంది
  • చంద్రబాబు హయాంలో పెగాసస్‌ను వాడారు
  • పెగాసస్‌ ద్వారా ఫోన్లు ట్యాపింగ్‌ చేసే అవకాశం ఉందన్న మంత్రి 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొన‌సాగుతున్నాయి. నేడు పలు సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెడ‌తారు. అలాగే, పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. స‌భ‌లో పెగాస‌స్ అంశంపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో పెగాసస్‌ అంశంపై చర్చ జ‌ర‌గాలని, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుందని చెప్పారు. 

పెగాసస్‌పై కమిటీ వేసి సుప్రీం కోర్టు దర్యాప్తు చేపట్టిందని గుర్తు చేశారు. గ‌తంలో ఏపీలో చంద్రబాబు హయాంలో పెగాసస్‌ను వాడారని ప‌శ్చిమ‌ బెంగాల్‌ సీఎం మమతా బెన‌ర్జీ స్పష్టంగా చెప్పారని మంత్రి బుగ్గన అన్నారు. పెగాసస్‌ సాప్ట్‌వేర్‌ ద్వారా ఫోన్లు ట్యాపింగ్‌ చేసే అవకాశం ఉంద‌ని తెలిపారు. పెగాసస్‌పై చర్చించి కమిటీకి రిపోర్ట్‌ చేయాల్సిన బాధ్యత ఉందని ఆయ‌న‌ అన్నారు.

pegasus
AP Assembly Session
Andhra Pradesh
Buggana Rajendranath

More Telugu News