Amaravati: పరిహారం చెల్లించండి... సీఆర్డీయే, రెరాకు అమరావతి రైతుల నోటీసులు

Amaravati farmers sent notices to CRDA and AP RERA
  • నాడు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు
  • అభివృద్ధి చేసిన ప్లాట్లు రైతులకు తిరిగిచ్చేలా ఒప్పందం
  • ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలోనే ఉందన్న రైతులు
రాజధాని అమరావతి కోసం రైతులు 30 వేల ఎకరాలకు పైగా భూములు ఇవ్వడం తెలిసిందే. భూములను అభివృద్ధి చేసి తిరిగి రైతులకు అప్పగించే విధంగా నాడు ఒప్పందం జరిగింది. అయితే, నిర్ణీత వ్యవధిలోగా తమ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వలేదంటూ సీఆర్డీయే (క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ), ఏపీ రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ)లకు అమరావతి రైతులు తాజాగా నోటీసులు ఇచ్చారు. 

సీఆర్డీయే చేపట్టిన ప్రాజెక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని పేర్కొన్నారు. జరిగిన ఆలస్యానికి పరిహారం చెల్లించాలని ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.3 లక్షలు చెల్లించాలన్నారు. నెలకు నివాస యోగ్య స్థలాలకు గజానికి రూ.50 చొప్పున, కమర్షియల్ ల్యాండ్ కు రూ.75 చొప్పున చెల్లించాలని కోరారు.
Amaravati
Farmers
Notices
CRDA
RERA
Andhra Pradesh

More Telugu News