Bandi Sanjay: బోధన్ లో హిందూ యువకులపై దాడి దారుణం: బండి సంజయ్

  • బోధన్ లో రాత్రికిరాత్రే శివాజీ విగ్రహ ప్రతిష్టాపన
  • తీవ్రంగా వ్యతిరేకించిన ఓ వర్గం
  • ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం
  • బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు
Bandi Sanjay responds over Bodhan incidents

నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఓ వర్గం వారు విగ్రహ ప్రతిష్టాపన చేయగా, మరో వర్గం వారు వ్యతిరేకించారు. బీజేపీ, శివసేనకు చెందినవారు విగ్రహం ఏర్పాటు చేశారంటూ మైనారిటీ వర్గానికి చెందిన వారు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారు మోహరించగా, పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే, ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో, పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. 

ఈ పరిస్థితులపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. బోధన్ లో హిందూ యువకులపై దాడి దారుణమని పేర్కొన్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్, పోలీసులు కలిసి ఈ దాడికి పాల్పడ్డారని బండి సంజయ్ ఆరోపించారు. బోధన్ లో శివాజీ విగ్రహ స్థాపన కోసం మున్సిపాలిటీ తీర్మానం కూడా చేసిందని స్పష్టం చేశారు. రాళ్లదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. సీపీ నానా బూతులు తిట్టి, లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. సీపీ ఓ రౌడీలా వ్యవహరిస్తున్నారని, పోలీసులు గాల్లో రబ్బరు బుల్లెట్లు కాల్చారని పేర్కొన్నారు.

More Telugu News