Diesel: అంతర్జాతీయ విపణిలో భగ్గుమంటున్న చమురు ధరలు... భారత్ లో డీజిల్ పై రూ.25 పెంపు

  • ఉక్రెయిన్ పై రష్యా దాడులు
  • 40 శాతం పెరిగిన ముడిచమురు ధరలు
  • 140 డాలర్లకు చేరిన ఒక బ్యారెల్ క్రూడాయిల్
  • భారత్ లో డీజిల్ పై టోకు ధర పెంచిన చమురు సంస్థలు
Bulk diesel price hiked in India

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం భారత్ పైనా పడింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటుండడంతో భారత్ లో టోకు విక్రయదారులకు అమ్మే డీజిల్ పై రూ.25 పెంచారు. భారత్ లోని ప్రధాన చమురు సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. 

రోజువారీ విధానంలో ధరలు పెంచిన భారత చమురు సంస్థలు నవంబరు 4 తర్వాత ఇప్పటివరకు పెట్రో ధరలు పెంచలేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు భయపడి కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఇటీవల ఎన్నికల ఫలితాలు వచ్చినా, ఆపై పార్లమెంటు సమావేశాలను దృష్టిలో ఉంచుకుని చమురు ధరలపై ఎలాంటి ప్రకటన రాలేదు. 

అయితే, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావంతో అంతర్జాతీయస్థాయిలో క్రూడాయిల్ ధర 40 శాతం పెరిగింది. ఒక బ్యారెల్ క్రూడాయిల్ ధర 140 డాలర్లకు చేరింది. ఈ క్రమంలో భారత్ చమురు సంస్థలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. అయితే, డీజిల్ టోకు ధర పెంచినా, రిటైల్ ధరలో మార్పేమీ లేదు. మరికొన్నిరోజుల్లో దీనిపై సమీక్ష జరిగే అవకాశం ఉంది.

More Telugu News