Briatain: రష్యా రూటు మార్చింది జాగ్రత్త!: బ్రిటన్ హెచ్చరికలు

Britain says Russia changes its course in Ukraine
  • గత మూడు వారాలకు పైగా ఉక్రెయిన్ లో రష్యా దాడులు
  • ఉక్రెయిన్ నుంచి అనూహ్య ప్రతిఘటన
  • నిర్దేశిత లక్ష్యాలు సాధించలేకపోయిన రష్యా
  • శక్తిమంతమైన ఆయుధాలతో తాజా దాడులు
  • రంగంలోకి కింజాల్ హైపర్ సోనిక్ క్షిపణులు
ఉక్రెయిన్ పై గత మూడు వారాలుగా యుద్ధం చేస్తున్న రష్యా ఇంతవరకు అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. దాంతో, రష్యా పంథా మార్చిందని బ్రిటన్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ పట్టణాల్లో మరింత విధ్వంసం సృష్టించేందుకు భారీ ఆయుధాలను ప్రయోగిస్తోందని తెలిపింది. 

బ్రిటన్ వ్యాఖ్యలు నిజమే అని నిరూపించేలా రష్యా తన అత్యాధునిక హైపర్ సోనిక్ క్షిపణులను ఉక్రెయిన్ లోని కీలక లక్ష్యాలపై ప్రయోగిస్తోంది. నిన్న ఓ ఆయుధాగారంపై కింజాల్ క్షిపణిని ప్రయోగించిన రష్యా... నేడు మైకోలెవ్ ప్రాంతంలోని ఇంధన నిల్వల సముదాయంపై కింజాల్ క్షిపణులతో విరుచుకుపడింది. 

ఉక్రెయిన్ నగరాల్లో తమ సేనలకు అనూహ్య రీతిలో ప్రతిఘటన ఎదురవడాన్ని భరించలేకపోతున్న రష్యా... శక్తిమంతమైన ఆయుధాలను రంగంలోకి తీసుకువస్తోందని బ్రిటన్ హెచ్చరించింది. వీటి ప్రభావంతో భారీగా ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా పెరుగుతుందని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Briatain
Russia
Ukraine
Kinzhal

More Telugu News