Vijayasai Reddy: చంద్రబాబు ప్రభుత్వం 25 కోట్ల రూపాయ‌ల‌తో కొనుగోలు చేసింది ఏమిటి?: విజ‌య‌సాయిరెడ్డి

vijaya sai slams chandra babu
  • ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్ ఫ్రాంచైజీగా ఏబీ వెంకటేశ్వరరావు తనయుడు 
  • సాయికృష్ణను విచారిస్తే పెగాసెస్ గుట్టు బయ‌టికొస్తుంది
  • మమత చెప్పిన పెగాసస్ ధర కూడా 25 కోట్ల రూపాయ‌లే
ఇజ్రాయిల్ నుంచి పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను గ‌తంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారని ప‌శ్చిమ బెంగాల్ సీఎం మమతా బెన‌ర్జీ ఆరోపించిన విష‌యం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి స్పందిస్తూ ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేశారు.  

''ఇజ్రాయిల్ కంపెనీ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్ ఫ్రాంచైజీగా ఉన్న అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు తనయుడు సాయికృష్ణను విచారిస్తే పెగాసెస్ గుట్టు బయ‌టికొస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం 25 కోట్ల రూపాయ‌ల‌తో కొనుగోలు చేసింది ఏమిటి? మమత చెప్పిన పెగాసస్ ధర కూడా 25 కోట్ల రూపాయ‌లే'' అని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.
Vijayasai Reddy
YSRCP
Telugudesam

More Telugu News