Lakshya Sen: ల‌క్ష్య‌సేన్ జైత్ర‌యాత్ర‌... ఆల్ ఇంగ్లండ్ ఫైన‌ల్ చేరిక‌

Lakshya Sen in finals of Yonex All England Badminton Championship
  • సెమీస్‌లో మ‌లేసియా ఆట‌గాడిపై విజయం
  • ఫైన‌ల్‌లో నెగ్గితే టైటిల్ నెగ్గిన మూడో ఇండియ‌న్‌గా ల‌క్ష్య‌సేన్‌
  • ఫైన‌ల్ చేరిన ఐదో భార‌తీయుడిగా ఇప్ప‌టికే రికార్డు
భార‌త బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు ల‌క్ష్య‌సేన్ స‌త్తా చాటుతున్నాడు. తుది అంకానికి చేరుకున్న ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్ టోర్నీలో భార‌త ఆట‌గాళ్లంతా నిరుత్సాహ ప‌ర‌చ‌గా.. ల‌క్ష్య‌సేన్ మాత్రం టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. శ‌నివారం రాత్రి జ‌రిగిన సెమీస్‌లో అత‌డు మ‌లేసియా ఆట‌గాడు లీ జీ జియాపై 21- 13, 12-21, 21-19 తేడాతో విజ‌యం సాధించాడు. 

ఇదిలా ఉంటే.. ఫైన‌ల్ చేర‌డంతోనే ఓ రికార్డును సొంతం చేసుకున్న ల‌క్ష్య‌సేన్,.. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్‌లో ఫైన‌ల్ చేరిన ఐదో భార‌త ఆటగాడిగా రికార్డుల‌కెక్కాడు. త‌న జైత్ర‌యాత్ర‌ను ఫైన‌ల్‌లోనూ కొన‌సాగిస్తే.. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్ షిప్ గెలిచిన మూడో భార‌తీయుడిగా ల‌క్ష్య‌సేన్ రికార్డుల‌కెక్క‌నున్నాడు.
Lakshya Sen
Yonex All England Badminton Championships
All England Badminton Championship

More Telugu News