RRR: 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై

Karnataka CM Basavaraj Bommai attends RRR Pre Release Event
  • చిక్కబళ్లాపూర్ లో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా సీఎం బసవరాజ్ బొమ్మై
  • కన్నడ భాషలో కృతజ్ఞతలు తెలిపిన రాజమౌళి
  • ఈవెంట్ కు హాజరైన కర్ణాటక మంత్రులు సుధాకర్, నాగరాజ్
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ లో ప్రారంభమైన ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సీఎం బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, సీఎం బసవరాజ్ బొమ్మైకి కన్నడ భాషలో కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఎంతగానో సహకరించారని కొనియాడారు. 

ఇక, ఇదే కార్యక్రమానికి హాజరైన కర్ణాటక ఆరోగ్యశాఖమంత్రి, చిక్కబళ్లాపూర్ శాసనసభ్యులు డాక్టర్ కె.సుధాకర్ కు కూడా రాజమౌళి సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సుధాకర్ సహకారం లేనిదే తాము చిక్కబళ్లాపూర్ లో ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించగలిగేవాళ్లం కాదని వినమ్రంగా తెలిపారు. ఈ సందర్భంగా చిక్కబళ్లాపూర్ ఇన్చార్జి మంత్రి ఎంటీబీ నాగరాజ్ కు కూడా రాజమౌళి ధన్యవాదాలు తెలియజేశారు. అభిమానులను ఉద్దేశించి, ఫ్యాన్స్ హోరు వింటుంటే అరేబియా సముద్రం ఘోషలా అనిపిస్తోందని అన్నారు. 

అంతేకాదు, తొలిసారిగా తన అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, ఇతర స్టాఫ్ గురించి రాజమౌళి ప్రస్తావించారు. వారి సేవలను పేరుపేరునా కొనియాడారు. 

కాగా, తాను ప్రతి సీన్ ను నటీనటులతో తీసేముందు తన అసిస్టెంట్ డైరెక్టర్లతో టెస్ట్ షూట్ చేసేవాడ్నని రాజమౌళి వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ అయ్యాక, తన అసిస్టెంట్ డైరెక్టర్లతో షూట్ చేసిన ఆర్ఆర్ఆర్ ను కూడా విడుదల చేస్తామని, అంతకు మించి కామెడీ చిత్రం ఇంకోటి ఉండదని చమత్కరించారు.
RRR
Rajamouli
Basavaraj Bommai
Chikka Ballapur
Karnataka

More Telugu News