Jagan: భార‌త్‌లో జ‌పాన్ ప్ర‌ధాని.. భారీపెట్టుబ‌డులు వ‌చ్చిన‌ట్టే!

  • రెండు రోజుల భార‌త ప‌ర్య‌ట‌న‌కు కిషిదా
  • 5 ట్రిలియ‌న్ యెన్‌ల పెట్టుబ‌డి ప్ర‌ణాళిక రాక‌?
  • ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో ద్వైపాక్షిక చ‌ర్చ‌లు ప్రారంభం
japan prime minister arrives delhi for two days india tour

జపాన్ ప్ర‌ధాన మంత్రి ఫుమియో కిషిదా రెండు రోజుల భార‌త ప‌ర్య‌ట‌న నిమిత్తం శ‌నివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్ ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. కాసేప‌టి క్రితం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో భేటీ అయిన ఆయ‌న భార‌త్‌తో ద్వైపాక్షిక చ‌ర్చ‌ల‌ను ప్రారంభించారు. ఇరు దేశాల మ‌ధ్య స్నేహ సంబంధాల మెరుగుద‌ల‌కు మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా ఇరు దేశాల ప్ర‌ధానులు చ‌ర్చిస్తున్నారు.

ఇదిలా ఉంటే..భార‌త్‌లో భారీ మొత్తంలో పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌ల‌తో జపాన్ ప్ర‌ధాని వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. భార‌త్‌లో ఏకంగా 5 ట్రిలియ‌న్ యెన్‌(42 బిలియ‌న్ డాల‌ర్లు) మేర పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌తో ఆయ‌న ఢిల్లీ చేరుకున్న‌ట్లుగా స‌మాచారం. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నుంది.

  • Loading...

More Telugu News