Manjima Mohan: ఆ హీరో ప్రేమను నేను అంగీకరించలేదు: హీరోయిన్ మంజిమా మోహన్

I never accepted Gowtham Karthik love says Manjima Mohan
  • మంజిమా, గౌతమ్ కార్తీక్ లు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు
  • ఆ వార్తల్లో నిజం లేదన్న మంజిమా
  • తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని విన్నపం

హీరోయిన్ మంజిమా మోహన్, యంగ్ హీరో గౌతమ్ కార్తీక్ ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇటీవలి కాలంలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇద్దరూ కలిసి ఓ తమిళ సినిమాలో నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో మంజిమా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వార్తలన్నీ అబద్ధమేనని ఆమె కొట్టి పారేసింది. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామంటూ వస్తున్న వార్తలను విని తాను భయపడ్డానని చెప్పింది. ఈ వార్తలకు తన తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారో అనే భయం కలిగిందని... కానీ వారు దేవుడి దయ వల్ల ఈ వార్తలను సీరియస్ గా తీసుకోలేదని తెలిపింది. గౌతమ్ ప్రేమను తాను అంగీకరించలేదని చెప్పింది. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని... తన జీవితంలో ఏదైనా ఉంటే తానే చెపుతానని తెలిపింది.

  • Loading...

More Telugu News