Vijayasai Reddy: 'ది క‌శ్మీర్ ఫైల్స్' సినిమాను గుర్తు చేస్తూ ‘బాబు ఫైల్స్’ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్

vijay sai slams tdp
  • చేసిన పాపాలు కోడెనాగుల్లా వెంట పడతాయి
  • చంద్రబాబుకు ఇప్పుడిపుడే అర్థమవుతోంది
  • పెగాసస్ స్పైవేర్ కొనుగోలు విషయాన్ని మమత బాంబులా పేల్చారు
  • పార్టీలకు ఫండింగ్ చేసిన ‘బాబు ఫైల్స్’ ఓపెన్ అవుతాయని వణికిపోతున్నారన్న విజయసాయి 
పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను గ‌తంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారంటూ ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెన‌ర్జీ బెంగాల్ అసెంబ్లీలో వ్యాఖ్యానించడం రాజకీయంగా దుమారం రేపుతోన్న విష‌యం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందిస్తూ 'ది క‌శ్మీర్ ఫైల్స్' సినిమాను గుర్తు చేస్తూ ‘బాబు ఫైల్స్’ ఓపెన్ అవుతాయని వణికిపోతున్నారని విమ‌ర్శించారు.

'చేసిన పాపాలు కోడెనాగుల్లా వెంటపడతాయని చంద్రబాబుకు ఇప్పుడిపుడే అర్థమవుతోంది. పెగాసస్ స్పైవేర్ కొనుగోలు విషయాన్ని మమత బాంబులా పేల్చేటప్పటికి తండ్రీకొడుకులకు ముచ్చెమటలు పట్టాయి. నోరువిప్పితే అప్పట్లో పార్టీలకు ఫండింగ్ చేసిన ‘బాబు ఫైల్స్’ ఓపెన్ అవుతాయని వణికిపోతున్నారు' అని విజ‌య‌సాయిరెడ్డి విమర్శించారు. 
Vijayasai Reddy
YSRCP
Telugudesam

More Telugu News