Mahesh Babu: 'సర్కారువారి పాట' .. పెన్నీ సాంగ్ ప్రోమోలో మెరిసిన సితార!

Sarkaru Vaari Paata song promo released
  • పరశురామ్ నుంచి 'సర్కారువారి పాట'
  • మహేశ్ సరసన కీర్తి సురేశ్
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • మే 12న సినిమా రిలీజ్

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. మహేశ్ సరసన నాయికగా కీర్తి సురేశ్ అలరించనున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి వదిలిన 'కళావతి' సాంగ్ వ్యూస్ పరంగా .. లైక్స్ పరంగా కొత్త రికార్డులను సృష్టించింది.

ఇక ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా 'పెన్నీ' సాంగ్ ను ఈ నెల 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ  సాంగ్ కి సంబంధించి ఒక ప్రోమోను వదిలారు. ఈ సాంగ్ లో మహేశ్ బాబు కూతురు సితార కూడా మెరిసింది. అప్పుడే సితార ఇంతలా ఎదిగిందా అనే ఆశ్చర్యం  కలగకమానదు. ఈ సాంగ్ కి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. 

మొదటి నుంచి కూడా సితార డాన్సుల పట్ల ఆసక్తిని చూపుతూనే వచ్చింది. అందుకు సంబంధించిన వీడియోలను నమ్రత ఎప్పటికప్పుడు పోస్ట్  చేస్తూ వచ్చింది. అందువల్లనే సితార ఇప్పడూ చాలా ఈజ్ తో స్టెప్స్ అదరగొట్టేసింది. దాంతో ఫుల్ సాంగ్ కోసం అందరూ ఎదురుచూస్తూ కూర్చోవడం ఖాయం. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News