Telugudesam: టీడీపీకి షాక్.. ట్విట్టర్ అకౌంట్ హ్యాక్!

TDP Twitter account hacked
  • టీడీపీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు
  • ఎలాన్ మస్క్ కు చెందిన 'స్పేస్ ఎక్స్' ఫొటోలను ఉంచిన హ్యాకర్లు
  • ఖాతాను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీకి హ్యాకర్లు షాకిచ్చారు. ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఎలాన్ మస్క్ కు చెందిన 'స్పేస్ ఎక్స్' ఫొటోలను అందులో షేర్ చేశారు. అర్థం కాని విచిత్రమైన ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో తమ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు టీడీపీ ప్రకటించింది. దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ... తమ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని తెలిపారు. ట్విట్టర్ ఇండియా సహకారంతో ఖాతాను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. 
Telugudesam
Twitter
Account
Hack
Nara Lokesh

More Telugu News