Chandrababu: జగన్ కొత్త బ్రాండ్లు స్లో పాయిజన్ లా ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి: చంద్రబాబు

Chandrababu fires on CM Jagan over liquor brands
  • మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్న చంద్రబాబు
  • టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం
  • రూ.25 వేల కోట్లు స్వాహా చేశారని ఆరోపణ

కల్తీ సారా, జే బ్రాండ్ల మద్యంపై రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసనలు చేపడుతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఏపీలోనే ఎందుకున్నాయని ప్రశ్నించారు. జగన్ కొత్త బ్రాండ్లు స్లో పాయిజన్ లా ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని వ్యాఖ్యానించారు. మద్యం కమీషన్ల కింద ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News