Finland: ప్రపంచంలోనే అత్యంత సంతోషదాయకమైన దేశం ఇదే!

Finland emerges worlds most happiest country for fifth time
  • ఐరాస అనుబంధ సంస్థ తాజా జాబితా
  • ఫిన్లాండ్ కు అగ్రస్థానం
  • వరుసగా ఐదోసారి ఫిన్లాండ్ కు టాప్ ర్యాంక్
  • 136వ స్థానంలో భారత్
  • అట్టడుగున ఆఫ్ఘనిస్థాన్
యూరప్ దేశం ఫిన్లాండ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రపంచంలోనే అత్యంత సంతోషదాయకమైన దేశాల జాబితాలో ప్రథమస్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ ఈ జాబితాలో నెంబర్ వన్ గా నిలవడం ఇది వరుసగా ఐదోసారి. ఈ జాబితాలో ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్ (2), ఐస్ లాండ్ (3), స్విట్జర్లాండ్ (4), నెదర్లాండ్స్(5), లగ్జెంబర్గ్ (6), స్వీడన్ (7), నార్వే (8), ఇజ్రాయెల్ (9), న్యూజిలాండ్ (10) టాప్-10లో నిలిచాయి. అగ్రరాజ్యం అమెరికా ఈ ఆనందమయ దేశాల జాబితాలో 16వ స్థానంలో ఉంది. కెనడా ఓ మెట్టుపైన 15వ స్థానంలో నిలిచింది. బ్రిటన్ కు 17వ స్థానం లభించింది.

136వ స్థానంలో భారత్

ప్రపంచ సంతోషదాయక దేశాల జాబితాలో భారత్ 136వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో పొరుగుదేశాలు పాకిస్థాన్, శ్రీలంక ముందున్నాయి. పాకిస్థాన్ 121వ ర్యాంకు దక్కించుకోగా, శ్రీలంక 127వ స్థానంలో ఉంది.

ఆఫ్ఘనిస్థాన్ కు చివరిస్థానం

ఈ ఐక్యరాజ్యసమితి ప్రాయోజిత సూచికలో అత్యంత అశాంతి కలిగిన దేశంగా ఆఫ్ఘనిస్థాన్ (146) నిలిచింది. సంతోషదాయక దేశాల జాబితాలో ఆఫ్ఘన్ అన్నిటికంటే అట్టడుగున నిలిచింది. ఆఫ్ఘన్ కు పైన లెబనాన్, జింబాబ్వే దేశాలు నిలిచాయి.
Finland
Happiest Country
World Rankings
UN

More Telugu News