Goa: గోవాలో వ్యభిచార దందా గుట్టురట్టు... టీవీ నటిని కాపాడిన పోలీసులు

Goa police busted prostitution racket
  • సూత్రధారి హైదరాబాద్ కు చెందిన బిలాల్
  • ముగ్గురు మహిళలతో గోవాలో వ్యభిచార దందా
  • పక్కా ప్లాన్ వేసి పట్టుకున్న పోలీసులు
  • హైదరాబాద్ కు చెందిన ఓ మహిళకు విముక్తి
భారత్ లో పాశ్చాత్య సంస్కృతికి, పర్యాటకానికి చిరునామాగా నిలిచే గోవాలో పోలీసులు ఓ వ్యభిచార దందా గుట్టురట్టు చేశారు. ఈ సెక్స్ రాకెట్ ను నడిపిస్తున్నది హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కాగా, అతడిని గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని హఫీజ్ సయ్యద్ బిలాల్ (26) గా గుర్తించారు. ఈ సందర్భంగా, వ్యభిచార కూపంలో ఉన్న ముగ్గురు మహిళలను కాపాడారు. వారిలో ఒకరిని ముంబయికి చెందిన టీవీ నటిగా గుర్తించారు. 

పనాజీ సమీపంలోని సంగోల్డా గ్రామంలో వ్యభిచార రాకెట్ కార్యకలాపాలపై సమాచారం సేకరించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. దీనిపై క్రైమ్ బ్రాంచ్ విభాగం మీడియా ప్రకటన విడుదల చేసింది. తాము కాపాడిన మహిళల వయసు 30 నుంచి 37 సంవత్సరాల మధ్య ఉంటుందని, వారిలో ఇద్దరు ముంబయి విరార్ ప్రాంతానికి చెందినవారని, మరో మహిళ హైదరాబాద్ వాసి అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

బిలాల్ వ్యభిచార ముఠా కార్యకలాపాలపై పక్కా సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు... అతడి కోసం వల పన్నారు. 26 ఏళ్ల బిలాల్ ఈ నెల 17న ముగ్గురు మహిళలతో గోవా వచ్చినట్టు పోలీసులు పసిగట్టారు. సంగోల్డా గ్రామంలో ఓ హోటల్ కు అమ్మాయిని పంపిస్తే రూ.50 వేలు ఇస్తామని అతడితో ఒప్పందం కుదుర్చుకుని, సరైన ఆధారాలతో అతడిని పట్టుకున్నారు.
Goa
Police
Sangoldi Village
Panaji
Hyderabad
Mumbai

More Telugu News