పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం నిర్వహించిన దంపతులు!
- తమిళనాడులోని సేలం జిల్లా మెచ్చేరిలో ఘటన
- హైతి అనే మగ, సారా అనే ఆడ కుక్కలను పెంచుకుంటోన్న కుటుంబం
- సీమంతానికి ఆహ్వాన పత్రికలు ముద్రించి పిలుపు
- కుక్కను ఆశీర్వదించి వెళ్లిన బంధువులు
ఈ దంపతుల కుమార్తె హేమరాణి రెండు కుక్కలను పెంచుకుంటోంది. ఆ కుక్కలను కూడా మురుగన్, సుశీల దంపతులు తమ కుటుంబ సభ్యులలానే చూసుకుంటున్నారు. పొమేరియన్ రకానికి చెందిన హైతి అనే మగ శునకాన్ని, సారా అనే ఆడ కుక్కను ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు.
ఇటీవల సారా గర్భం దాల్చడంతో సీమంతం చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఆహ్వాన పత్రికలు ముద్రించి, తమ బంధు మిత్రులను ఆహ్వానించారు. ఆ కుక్క సీమంతానికి మహిళలను పిలిచి వారికి మిఠాయిలు, జాకెట్, గాజులు, తాంబూలం వంటివి సమర్పించుకున్నారు. వారు సంతోషం వ్యక్తం చేస్తూ కుక్కను ఆశీర్వదించారు.