తెలుగు తెరకు మరో కొత్త బ్యూటీ!

18-03-2022 Fri 11:35
  • తెలుగు తెరకి పెరుగుతున్న కొత్త హీరోయిన్ల తాకిడి 
  • దూసుకుపోతున్న కృతి శెట్టి, శ్రీలీల
  • 'గని'తో సయీ మంజ్రేకర్ పరిచయం 
  • ఏప్రిల్ 8వ తేదీన సినిమా రిలీజ్
Ghani movie update
కరోనా ప్రభావం కారణంగా చాలా సినిమాల షూటింగులు వాయిదా పడటం వలన, అనుకున్న సమయానికి అవి ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి. అదృష్టం కొద్దీ అప్పటికే కాస్త బయటపడిన సినిమా ద్వారా కృతి శెట్టి .. శ్రీలీల .. కేతిక శర్మ వంటి కథానాయికలు తెలుగు తెరకి పరిచయమయ్యారు. ప్రస్తుతానికి ముగ్గురూ మంచి దూకుడు మీదే ఉన్నారు.

ఇక త్వరలో రానున్న సినిమాల ద్వారా టాలీవుడ్ కి మరికొంతమంది కథానాయికలు పరిచయం కానున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' ద్వారా అలియా భట్, 'లైగర్' ద్వారా అనన్య పాండే, 'ఏజెంట్' సినిమా ద్వారా సాక్షి వైద్య, 'గని' మూవీతో సయీ మంజ్రేకర్ పరిచయం కానున్నారు. దాంతో ఈ సినిమాల పట్ల ప్రేక్షకులు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు.

సయీ మంజ్రేకర్ విషయానికి వస్తే ఆమె వరుణ్ తేజ్ జోడీగా 'గని' సినిమా చేసింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ సినిమాలో తన పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందనీ, ఈ పాత్ర తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని సయీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.