Raja Singh: అహంకారంతో కొట్టుకుంటున్నావ్ కేటీఆర్.. నీ బలుపు దింపుతాం: రాజాసింగ్

Raja Singh fires on KCR and KTR
  • 700 మంది నిరుద్యోగుల చావుకు కేసీఆర్ కారణమయ్యారు
  • కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేయడం ఆకాశంపై ఉమ్మేయడమే
  • కమలాకర్ పై పోటీకి ఒక సామాన్య బీజేపీ కార్యకర్త చాలు

గత ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ 700 మంది నిరుద్యోగుల చావుకు కారణమయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, కేవలం 80 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తానని చెప్పి, అదేదో గొప్ప విషయంగా ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. 

చనిపోయిన 700 కుటుంబాలకు ఏం చెపుతావ్ కేసీఆర్? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా యూపీఎస్సీ, ఎస్సెస్సీ, ఎన్డీఏ తదితర సంస్థల ద్వారా లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తోందని... అయినా కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేయడం ఆకాశంపై ఉమ్మేయడమే అవుతుందని అన్నారు. 

దమ్ముంటే మంత్రి గంగుల కమలాకర్ పై పోటీ చేసి గెలవాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ సవాల్ విసరడంపై రాజాసింగ్ మండిపడ్డారు. కమలాకర్ పై పోటీ చేయడానికి బండి సంజయ్ ఎందుకు? ఒక బీజేపీ సామాన్య కార్యకర్త చాలని అన్నారు. టీఆర్ఎస్ ను ఈసారి చిత్తుచిత్తుగా ఓడిస్తామని చెప్పారు. అధికారం, డబ్బు మదం, అహంకారంతో కొట్టుకుంటున్న కేటీఆర్ బలుపును దింపుతామని అన్నారు. 'నీ బలుపును దింపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకో కేటీఆర్' అంటూ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News