Nizamabad District: నాటుసారా విక్రయ కేంద్రాలపై దాడులకు వెళ్లిన ఆబ్కారీ ఎస్సై.. చితకబాదిన మందుబాబులు

Abkari SI and constable attacked in nizamabad dist
  • నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలో ఘటన
  • పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు
  • చిక్కిన ఒక వ్యక్తిని విచారించి వెళ్తున్న సమయంలో అడ్డుకున్న మిగతా ముగ్గురు
  • ఎస్సై లాఠీ లాక్కుని ఆయనపైనే దాడి
ఆబ్కారీ ఎస్సై, కానిస్టేబుల్‌ లపై నలుగురు మందుబాబులు దాడిచేసి చితకబాదారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని పురానీపేట శివారులో జరిగిందీ ఘటన. ఇక్కడ నాటుసారాను విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎస్సై నర్సింలు కానిస్టేబుల్‌ను వెంటపెట్టుకుని వెళ్లారు. ఆ సమయంలో అక్కడ మద్యం తాగుతున్న నలుగురు వ్యక్తులు వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. 

ఈ క్రమంలో ఒక వ్యక్తి పోలీసుల చేతికి చిక్కాడు. అతడిని విచారించి వెళ్తున్న ఎస్సై, కానిస్టేబుల్‌ను అడ్డుకున్న మిగతా ముగ్గురు వారిపై దాడిచేశారు. ఎస్సై చేతిలోంచి లాఠీ లాక్కుని చితకబాదారు. ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Nizamabad District
Bheemgal
Puranipet
Illicit Liquor

More Telugu News