Koil Sagar: మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని కోయిల్ సాగ‌ర్‌లో బోటింగ్ ప్రారంభం

boating started in koil sagar
  • పాల‌మూరులో టూరిస్ట్ డెస్టినేష‌న్‌గా కోయిల్ సాగ‌ర్‌
  • బోటింగ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌
  • ప‌ర్యాట‌కుల తాకిడి మ‌రింత పెరిగే అవకాశం 

ప‌ర్యాట‌క ప‌రంగా కొత్త రాష్ట్రం తెలంగాణ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో లెక్క‌లేన‌న్ని టూరిస్ట్ కేంద్రాలు ఉండ‌గా.. ఆయా టూరిస్ట్ కేంద్రాల్లో ప‌ర్యాట‌కుల‌కు మ‌రింత వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే దిశ‌గా తెలంగాణ ప్ర‌భుత్వం వ‌రుస నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ప‌రిధిలోని కోయిల్ సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌లో కొత్త‌గా బోటింగ్ స‌దుపాయాన్ని ప్ర‌భుత్వం గురువారం ప్రారంభించింది.

దీనిని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌.. ఆ విషయాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేశారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో కోయిల్ సాగ‌ర్ ఇప్ప‌టికే ఓ టూరిస్ట్ డెస్టినేష‌న్‌గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. రిజ‌ర్వాయ‌ర్‌లో తాజాగా బోటింగ్ స‌దుపాయాన్ని కూడా ప్రారంభించడంతో అక్క‌డ ప‌ర్యాట‌కుల తాకిడి మ‌రింత మేర పెర‌గ‌నుంది.

  • Loading...

More Telugu News