Chiranjeevi: చిరూ 154లో మరో కథానాయికగా నివేదా పేతురాజ్!

Bobby movie update
  • తెలుగులో నివేదా పేతురాజ్ కి మంచి క్రేజ్
  • 'బ్రోచేవారెవరురా'తో మంచి గుర్తింపు 
  • కలిసిరాని 'పాగల్' సినిమా 
  • బాబీ సినిమాకి గ్రీన్ సిగ్నల్

మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీతో తెలుగు తెరకి పరిచయమైన కథానాయికలలో నివేదా పేతురాజ్ ఒకరు.'మెంటల్ మదిలో' సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఆమె కొన్ని సినిమాలు చేసినప్పటికీ, 'చిత్రలహరి' .. 'బ్రోచేవారెవరురా' మాత్రమే మంచి పేరును .. సక్సెస్ ను తెచ్చిపెట్టాయి. 

'రెడ్' .. 'పాగల్' సినిమాలు ఈ సుందరి కెరియర్ కి ఎంతమాత్రం హెల్ప్ కాలేకపోయాయి. ఇక 'విరాటపర్వం'లో నివేద ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ సినిమా తనకి తప్పకుండా మరింత మంచి పేరు తీసుకుని వస్తుందని ఆమె భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె చిరంజీవి 154వ సినిమా కోసం ఎంపికైనట్టుగా తెలుస్తోంది.

చిరంజీవి హీరోగా బాబీ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్ ను తీసుకున్నారు. ఒక ముఖ్యమైన పాత్ర కోసం రవితేజను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు చిరూ సరసన రెండవ నాయికగా నివేదా కనిపిస్తుందా? రవితేజ జోడీగా మెరుస్తుందా? అనేది చూడాలి.

  • Loading...

More Telugu News