Nani: 'అంటే .. సుందరానికీ' లీలా థామస్ తో ఎలా కుదురుతుందబ్బా?

Ante Sundaraniki movie update
  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'అంటే .. సుందరానికీ'
  • నాని సరసన నాయికగా నజ్రియా 
  • సంగీత దర్శకుడిగా వివేక్ సాగర్ 
  • జూన్ 10వ తేదీన విడుదల 
నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ 'అంటే .. సుందరానికీ' సినిమాను రూపొందించాడు. మైత్రీ మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన నాయికగా నజ్రియా నటించింది. ఈ సినిమాలో ఆమె లీలా థామస్ పాత్రను పోషించింది. కొంతసేపటి క్రితం ఆమె లుక్ తో పోస్టర్ ను .. ఆమె పాత్రను పరిచేయం చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. 

సుందరం సంప్రదాయబద్ధమైన కుటుంబానికి చెందినవాడు. ఆచార వ్యవహారాలతో సతమతమయ్యే జీవితం ఆయనది. లీలా థామస్ పోస్టర్ చూస్తే ఆమె చాలా మోడ్రన్ లుక్ తో కనిపిస్తోంది. ఆమె మాటల్లో ఆధునికభావాలు తెలుస్తున్నాయి. పంచెకట్టుతో పద్ధతిగా సాగే ఆయన జీవితంలోకి లీలా థామస్ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందనేది ఈ కథ. 

లవ్ .. ఎమోషన్ .. కామెడీని కలిసి హాయిగా నవ్వించడం వివేక్ ఆత్రేయకి బాగా తెలుసు. ఆ విషయాన్ని ఆయన నుంచి ఇంతకుముందు వచ్చిన 'బ్రోచేవారెవరురా' నిరూపించింది. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేయనున్నారు.
Nani
Nazriya
Vivek Athreya
Ante Sundaraniki Movie

More Telugu News