వాట్సాప్ ద్వారా అవినీతిపై ఫిర్యాదు.. పంజాబ్ నూతన సీఎం మాన్ కీలక నిర్ణయం
- సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరునాడే మాన్ కీలక నిర్ణయం
- అవినీతిపై పంజాబ్ ప్రజలు సులువుగా ఫిర్యాదు కోసం కొత్త విధానం
- మార్చి 23 నుంచి ఈ విధానం అమలులోకి రానుందని తెలిపిన సీఎం
పంజాబ్ సీఎంగా ఆప్ నేత భగవంత్ మాన్ పదవీ బాధ్యతలు చేపట్టిన మరునాడే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతిపై పంజాబ్ ప్రజలు సులువుగా ఫిర్యాదు చేసే దిశగా మాన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అవినీతిపై వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసేలా మాన్ ఓ సరికొత్త విధానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. అమర వీరుల దినోత్సవమైన ఈ నెల 23 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానున్నట్లుగా ఆయన ప్రకటించారు.