Vundavalli Sridevi: రియలెస్టేట్ కోసం రైతులతో తిట్టిస్తున్నారు: ఉండవల్లి శ్రీదేవి

YSRCP MLA Vundavalli Sridevi gives new meaning to CRDA
  • ఖరీదైన స్థలాల్లో రాజధానిని పెట్టారు
  • సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియలెస్టేట్ డెవలప్ మెంట్ అథారిటీ
  • తుళ్లూరు రైతులను బెదిరించి 52 వేల ఎకరాలను లాక్కున్నారు
ఖరీదైన స్థలాల్లో రాజధానిని పెట్టారని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీపై విమర్శలు గుప్పించారు. అసలు ప్రభుత్వ భూముల్లోనే రాజధాని ఉండాలని ఆమె అన్నారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియలెస్టేట్ డెవలప్ మెంట్ అథారిటీ అని ఆమె విమర్శించారు. రియలెస్టేట్ కోసం రైతులతో తమను తిట్టిస్తున్నారని మండిపడ్డారు.

 తుళ్లూరులో రైతులను బెదిరించి 52 వేల ఎకరాలను లాక్కున్నారని అన్నారు. భూములు లేని వారికి సీఆర్డీఏ ద్వారా రూ. 5 వేల పెన్షన్ ఇవ్వాలనుకుంటే కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. పట్టా భూములకు ఓ రేటు, అసైన్డ్ భూములకు మరో రేటు నిర్ణయించారని విమర్శించారు.
Vundavalli Sridevi
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News