YSRCP: వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై అట్రాసిటీ కేసు

sc st atrocity caseon ysrcp leader subbsra gupta
  • పొట్టి శ్రీరాములు విగ్ర‌హ ఏర్పాటుకు అనుమ‌తి కోసం మేయ‌ర్ వ‌ద్ద‌కు ఆర్య‌వైశ్యులు
  • మేయ‌ర్‌ను కులం పేరుతో దూషించిన సుబ్బారావు
  • మేయ‌ర్ ఫిర్యాదు మేర‌కే అట్రాసిటీ కేసు న‌మోదు
ప్ర‌శాం జిల్లా కేంద్రం ఒంగోలుకు చెందిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తా మ‌రోమారు వార్త‌ల్లోకెక్కారు. సుబ్బారావు గుప్తాపై ఒంగోలు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ‌క చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఒంగోలు మేయ‌ర్ గంగాడ సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేర‌కే ఆయ‌న‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేసిన‌ట్లు ఒంగోలు వ‌న్ టౌన్ పోలీసులు వెల్ల‌డించారు.  

ఒంగోలులో మంగ‌మూరు సెంట‌ర్‌లో పొట్టి శ్రీరాములు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని న‌గ‌రానికి చెందిన ఆర్య వైశ్యులు చాలా కాలం నుంచి య‌త్నిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే విగ్ర‌హం ఏర్పాటుకు అనుమ‌తి కోరేందుకు ప‌లువురు వైశ్యుల‌తో కలిసి సుబ్బారావు గుప్తా మేయ‌ర్ వ‌ద్ద‌కు వెళ్లారు‌. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న మేయ‌ర్ గంగాడ సుజాత‌ను కులం పేరుతో దూషించారు‌. మేయ‌ర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఒంగోలు వ‌న్ టౌన్ పోలీసులు సుబ్బారావు గుప్తాపై అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు.
YSRCP
Ongole
Prakasam District
Subbarao Gupta
Atrocity Case

More Telugu News