Ram Gopal Varma: 'రాధే శ్యామ్' సినిమాపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్

Ram Gopal Varma comments on Prabhas Radhe Shyam movie
  • సినీ అభిమానులకు విజువల్ ఫీస్ట్ అవసరం లేదు
  • కథలోని ఎమోషన్స్ ను విజువల్ ఫీస్ట్ చంపేస్తుంది 
  • విజువల్స్ కంటే కథలో దమ్ము ముఖ్యం
  • ఈ సినిమా బడ్జెట్ లో ఐదో వంతు ఖర్చుతో సినిమా తీయొచ్చన్న వర్మ 

భారీ బడ్జెట్ సినిమాలపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఒక నటుడి ముందు సినిమా సాధించిన వసూళ్ల ఆధారంగానే ఆయన తదుపరి సినిమాపై అంచనాలు ఉంటాయని వర్మ అన్నాడు. 'రాధే శ్యామ్' గురించి వర్మ మాట్లాడుతూ... ప్రభాస్ రెమ్యునరేషన్ ను పక్కన పెడితే... ఆ చిత్రాన్ని మొత్తం బడ్జెట్ లో ఐదో వంతు ఖర్చుతో తీసేయవచ్చని తెలిపారు. సినీ అభిమానులకు విజువల్ ఫీస్ట్ అవసరం లేదని చెప్పారు. 

కథలోని ఎమోషన్స్ ను విజువల్ ఫీస్ట్ చంపేస్తుందని అన్నారు. బాలీవుడ్ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్' గురించి అది విడుదలయ్యేంత వరకు కూడా ఎవరికీ తెలియదని.... కేవలం రూ. 4 నుంచి 5 కోట్లతో తెరకెక్కిన ఆ చిత్రం రూ. 100 కోట్లను వసూలు చేసిందని అన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కంటే కథలో ఉండే దమ్ము ముఖ్యమని చెప్పారు.

  • Loading...

More Telugu News