DRDO: డీఆర్డీఓ ఘ‌న‌త‌.. 45 రోజుల్లో ఏడంత‌స్తుల భ‌వంతి నిర్మాణం

  • యుద్ధ విమానాల ప‌రిశోధ‌నల కోసం అత్యాధునిక భ‌వంతి
  • అద్దాల‌తో మెరిసిపోయే భ‌వంతి నిర్మాణం
  • ప్రారంభించిన‌ రక్షణశాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్‌
drdo built seven storey building in just 45 days

ఆధునిక సాంకేతిక యుగంలో ఈ రోజు అందుబాటులో ఉన్న టెక్నాల‌జీ గంట‌లు తిర‌క్క‌ముందే అడ్వాన్స్ అయిపోతోంది. 4జీ అంటేనే మురిసిపోతున్న మ‌నం ఇప్ప‌టికే 5జీ టెక్నాల‌జీలోకి అడుగుపెట్టేశాం కూడా. ఈ త‌ర‌హా అప్‌డేష‌న్ దాదాపుగా అన్నిరంగాల్లోనూ చూస్తున్న‌దే. ఈ త‌రహా టెక్నాల‌జీని స‌ద్వినియోగం చేసుకుని అద్భుతాలు సృష్టించ‌డంలో అగ్ర‌గామిగా ఉన్న డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్డీఓ) తాజాగా మ‌రో అద్భుతాన్ని న‌మోదు చేసింది. 

ఏడంతస్తుల అత్యాధునిక భ‌వ‌నాన్ని ఆ సంస్థ కేవ‌లం 45 రోజుల్లో నిర్మించేసింది. ఫిఫ్త్ జ‌న‌రేష‌న్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప‌రిశోధ‌న‌ల కోసం ఓ అత్యాధునిక భ‌వ‌నాన్ని నిర్మించాల‌ని త‌ల‌చింది. అనుకున్న‌దే త‌డ‌వుగా బెంగ‌ళూరులో కేవ‌లం 45 రోజుల్లో అద్దాల‌తో త‌ళ‌త‌ళా మెరిసిపోయే ఏడంత‌స్తుల భ‌వంతిని నిర్మించింది. ఈ భ‌వనాన్ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ గురువారం లాంఛ‌నంగా ప్రారంభించారు.

More Telugu News