Vijayasai Reddy: వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజాతో పార్టీ బలోపేతం విషయమై చర్చించాను: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy and Roja discussions on strengthening of party
  • వైసీపీ అనుబంధ విభాగాలతో చర్చలు జరుపుతున్న విజయసాయి
  • మహిళా విభాగం అధ్యక్షురాలు రోజాతో చర్చించిన వైనం
  • మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని వ్యాఖ్య
వైసీపీ బలోపేతంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దృష్టి సారించారు. పార్టీకి సంబంధించిన అన్ని అనుబంధ విభాగాలను విజయసాయికి సీఎం జగన్ అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో విజయసాయి పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. 

ఈ క్రమంలో వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజాతో ఆయన సమాలోచనలు జరిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వీరు పలు విషయాలపై చర్చించారు. ఈ విషయాన్ని విజయసాయి ట్విట్టర్ ద్వారా తెలిపారు. పార్టీ బలోపేతంపై రోజాతో చర్చించడం జరిగిందని తెలిపారు. తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. 

మరోవైపు వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, ఇతర రైతు నాయకులతో కూడా విజయసాయి సుదీర్ఘ చర్చలు జరిపారు. దీనిపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ వైసీపీకి రైతులే వెన్నెముక అని అన్నారు. రైతుల మేలు కోసం వైసీపీ ఎప్పుడూ కృషి చేస్తుందని అన్నారు.
Vijayasai Reddy
YSRCP
Roja

More Telugu News