R S Praveen Kumar: బందుల పైస‌లు చ‌ల్లే మీరు ఈ సారి బందీ కాక త‌ప్ప‌దు: కేసీఆర్‌పై ఆర్ఎస్ ప్ర‌వీణ్ వ్యాఖ్య

rspraveen kumar satires on kcr
  • కొన‌సాగుతున్న బ‌హుజ‌న యాత్ర‌
  • కేసీఆర్ స‌ర్కారు లోపాల‌పై ప్ర‌వీణ్ వ‌రుస విమ‌ర్శ‌లు
  • చొప్ప‌దండిలో ముంద‌స్తు అరెస్టుల‌పై ఆగ్ర‌హం

బ‌హుజ‌న స‌మాజ్ వాదీ పార్టీ తెలంగాణ క‌న్వీన‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సీఎం కేసీఆర్‌పై వ‌రుస‌గా సెటైర్లు సంధిస్తున్నారు. బ‌హుజ‌న యాత్ర పేరిట తెలంగాణ‌లో ఇప్ప‌టికే ప‌లు జిల్లాల‌ను క‌వ‌ర్ చేసిన ప్ర‌వీణ్‌... ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా బుధ‌వారం నాడు ఆయ‌న బీఎస్పీ నేత‌ల‌ను అరెస్ట్ చేస్తున్న వైనానికి నిర‌స‌న‌గా కేసీఆర్‌పై సెటైర్ సంధించారు. 

క‌రీంన‌గ‌ర్ జిల్లా చొప్ప‌దండిలో మంత్రుల ప‌ర్య‌ట‌న సాగుతున్న నేప‌థ్యంలో బీఎస్పీ నేత‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేస్తున్న వైనాన్ని ప్ర‌శ్నించిన ప్ర‌వీణ్ కుమార్..బీఎస్పీ నేత‌ల మాట విన‌బ‌డ‌గానే కేసీఆర్ ఎందుకు వ‌ణికిపోతున్నార‌ని ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ స‌ర్కారు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని బందుల పైస‌లు చ‌ల్లినా తెలంగాణ బ‌హుజ‌న బిడ్డ‌లు కేసీఆర్‌ను ఈ ద‌ఫా ఇంటిలో బందీగా చేయ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌వీణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా మంత్రుల ప‌ర్య‌టన నేప‌థ్యంలో బీఎస్పీ ఫ్లెక్సీని చించేసిన వైనంపైనా ప్ర‌వీణ్ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News