Tollywood: ప్రణతి పుట్టినరోజు నాడు.. నేను, చరణ్ అర్ధరాత్రి షికారుకెళ్లిపోతాం: తారక్

Tarak Interesting Comments On Charan
  • ఈ విషయం నాకు, చెర్రీకి తప్ప ప్రపంచానికి తెలియదు
  • నన్ను విమర్శించేది ఇద్దరే వ్యక్తులు
  • ఒకరు మా నాన్న హరికృష్ణ.. ఇంకొకరు రాజమౌళి
  • తానీ స్థాయిలో ఉన్నానంటే రాజమౌళి చలవేనన్న తారక్
ఆర్ఆర్ఆర్ సినిమా మరో వారంలో విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచేసింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి.. తారక్, రామ్ చరణ్, రాజమౌళిలను ఇంటర్వ్యూ చేశారు. సరదా ప్రశ్నలు అడిగారు. అరగంటపాటు సాగిన చిట్ చాట్ లో.. తారక్ పంచ్ లు, ఆయన చెప్పిన విషయాలే హైలైట్ గా నిలిచాయి. 

నెట్టింట్లో ఆ విషయాలు వైరల్ అయ్యాయి. చరణ్ తో తనకున్న అనుబంధాన్ని ఆయన వివరించారు. చరణ్ తో ఎన్నో ఏళ్ల నుంచి స్నేహబంధం ఉందని అన్నారు. ఈ విషయాన్ని ఇద్దరం ఎప్పుడూ బయటపెట్టలేదని చెప్పారు. చరణ్ బయటకు సైలెంట్ గానే ఉన్నా.. లోలోపల మాత్రం అగ్నిపర్వతం బద్దలైపోతున్నట్టు ఉంటుందని తెలిపారు. అదే తనకు బాగా నచ్చిందన్నారు. 

‘‘నా శ్రీమతి ప్రణతి పుట్టిన రోజు మార్చి 26. ఆ రోజు అర్ధరాత్రి 12 దాటగానే (మార్చి 27) నేను ఇంటి గేటు దగ్గర నిలబడతాను. ఆ వెంటనే చరణ్ కారొచ్చేస్తుంది. మేమిద్దరం బయటకు రయ్యిన దూసుకెళ్లిపోతాం. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది’’ అని చెప్పారు. ఈ విషయం తమకు తప్ప ప్రపంచానికి తెలియదని అన్నారు. 

తనను ఓపెన్ గా విమర్శించే వ్యక్తులు ఇద్దరేనని, ఒకరు తన తండ్రి హరికృష్ణ అయితే, ఇంకొకరు రాజమౌళి అని తారక్ చెప్పుకొచ్చారు. తాను నటుడిగా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం రాజమౌళేనని అన్నారు. అంతేగాకుండా సెట్ లో రాజమౌళి ఎలా ఉంటారో అనుకరించి చూపించారు. వల్లి, రమా రాజమౌళి, కార్తికేయలతో తాను ఎలా మాట్లాడేది కూడా అభినయించి చూపించారు.
Tollywood
Ramcharan
Jr NTR
Junior NTR
Rajamouli
Anil Ravipudi

More Telugu News