IPL: ఐపీఎల్ దరిదాపుల్లోకి రాలేరు: రమీజ్ రాజా వ్యాఖ్యలకు ఆకాశ్ చోప్రా కౌంటర్

Dont think anyone can compete with IPL
  • ఐపీఎల్ తో పోటీ పడదామనుకోవద్దు
  • ఏ ఇతర లీగ్ ఐపీఎల్ సమీపానికి రాలేదు
  • భారత్ లో వీక్షకులు అపారం
  • ఆదాయ పరంగా బలమైన లీగ్ అన్న ఆకాశ్ 
ఐపీఎల్ కు దీటుగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను తీర్చిదిద్దుతామని, వచ్చే ఏడాది నుంచి తాము సైతం ఆటగాళ్ల వేలం నిర్వహించాలని అనుకుంటున్నట్టు పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా చేసిన ప్రకటనపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. 

‘‘పీఎస్ ఎల్ మాత్రమే కాదు.. ప్రపంచంలో ఏ ఇతర క్రికెట్ లీగ్ అయినా, బిగ్ బాష్ లీగ్ సహా ఐపీఎల్ స్థాయిని అందుకోలేదు. భారత్ లో ఐపీఎల్ కు భారీ వీక్షకులు ఉండడమే కాదు. ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న లీగ్ ఐపీఎల్’’ అంటూ ఐపీఎల్ తో పోటీపడడం ఎవరి తరమూ కాదన్నట్టు  ఆకాశ్ చోప్రా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

‘‘పీఎస్ఎల్ ను వేలం విధానానికి తీసుకెళితే మా పర్స్ (ఆదాయం) పెరుగుతుంది. దాంతో ఐపీఎల్ కు చెక్ పెట్టొచ్చు. అప్పుడు పీఎస్ఎల్ ను కాదని ఐపీఎల్ ఆడటానికి ఎవరు వెళతారో చూస్తాం’’ అంటూ బెదిరింపు ధోరణిలో రమీజ్ రాజా ఇటీవల మాట్లాడడం గమనార్హం.

పీఎస్ఎల్ 2016లో ఏర్పడింది. మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ప్రతీ జట్టు కూడా ఆటగాళ్లతో ఒప్పందాలు చేసుకుంటుంది. అక్కడ వేలం విధానం లేదు. ఐపీఎల్ స్థాయిలో కాకపోయినా, పీఎస్ఎల్ కూడా లాభాలతోనే నడుస్తోంది.
IPL
psl
compete
akash chopra
ramiz raja

More Telugu News