curators: మీకు చేతకాకపోతే భారత క్యురేటర్ల సాయం తీసుకోండి.. పీసీబీకి పాక్ మాజీ బౌలర్ సూచన

Find out from curators in Mumbai Bengaluru Chennai  Ex Pakistan pacer
  • ముంబై, చెన్నై, బెంగళూరు లో క్యురేటర్లు ఉన్నారు
  • ఎక్కడికో ఎందుకు వెళ్లడం?
  • పిచ్ తయారీపై మాజీ బౌలర్ జావెద్ స్పందన
  • ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల్లోనూ పాక్ కు సహకరించని పిచ్ లు
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం రూపొందించిన పిచ్ ల పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) వరుస విమర్శలు ఎదుర్కొంటోంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచుల సిరీస్ నడుస్తోంది. ఇందులో రావల్పిండి, కరాచి వేదికలపై భారీ స్కోర్లు నమోదు కావడమే విమర్శలకు కారణంగా ఉంది. దీనిపై పలువురు మాజీ ప్లేయర్లు విమర్శలు కురిపించారు.

వీరికి మాజీ ఫాస్ట్ బౌలర్ అకీబ్ జావెద్ కూడా స్వరం కలిపాడు. పాకిస్థాన్ లోని క్యూరేటర్లు పిచ్ లను ఎలా తయారు చేయాలనే దానిపై భారత్ క్యూరేటర్ల నుంచి సలహాలు తీసుకోవాలని సూచించాడు. ‘‘ఎక్కడికో వెళ్లడం ఎందుకు? ముంబై, బెంగళూరు, చెన్నైలోని క్యురేటర్లను గుర్తించండి. భారత స్పిన్నర్ల ఆధిపత్యం ఉండేలా వారు పిచ్ లను ఎలా రూపొందిస్తున్నదీ తెలుసుకోవాలని నా సూచన. పాకిస్థాన్ ఆధిపత్యం ఉండేలా పిచ్ లను రూపొందించకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది’’ అని జావెద్ అన్నాడు.

భారత్ ఇటీవలే శ్రీలంకతో రెండు టెస్ట్ మ్యాచులను నిర్వహించడం తెలిసిందే, రెండింటిలోనూ భారత్ వైట్ వాష్ చేసేసింది. శ్రీలంకను చిత్తుగా ఓడించింది. భారత బౌలర్లను ఎదుర్కోవడం వారివల్ల కానే కాలేదు. భారత బౌలర్లకు అనుకూలంగా పిచ్ లు రూపొందించారు. దీంతో జావెద్ ఈ సూచన చేసినట్టు తెలుస్తోంది.
curators
India
paksitan
pcb
Aaqib Javed

More Telugu News