Ramcharan: మంచు కొండ‌ల్లో భార్య‌తో హీరో రామ్ చ‌ర‌ణ్ విహారం .. ఫొటోలు వైర‌ల్

RamCharan  and his wife upasana are giving major vacation goals
  • టూర్ వెళ్లిన‌ రామ్ చ‌ర‌ణ్, ఉపాసన  
  • వారి వెంటే స్నేహితులు కూడా 
  • ఫిన్లాండ్ లోని మంచు కొండ‌ల్లో విహారం
సినీ న‌టుడు రామ్ చరణ్ త‌న భార్య‌ ఉపాసనతో క‌లిసి తాజాగా టూర్‌కి వెళ్లాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మంచు కొండ‌ల్లో తీసుకున్న మ‌రిన్ని ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. సామాజిక మాధ్యమాల్లో ఇవి వైర‌ల్ అవుతున్నాయి. ఈ టూర్‌లో రామ్ చ‌ర‌ణ్, ఉపాసన స్నేహితులు కూడా ఉన్నారు. 

                      
ఫిన్లాండ్ లోని మంచు కొండ‌ల్లో చెర్రీ ఐస్‌ను తొల‌గించి దాని కింద ఉన్న నీటిని తాగాడు. అలాగే, చలి కాచుకుంటూ వారు ఎంజాయ్ చేశారు. చెర్రీ న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న మ‌రో సినిమా షూటింగ్‌కు కాస్త విరామం లభించింది. దీంతో ఉపాస‌న‌తో క‌లిసి చెర్రీ టూర్ వెళ్లి ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు.    

        
Ramcharan
Tollywood
Viral Pics
Viral Videos

More Telugu News