Mamata Banerjee: అందుకే బెంగాల్ నుంచి బీహారీలు వెళ్లిపోయేలా చేసేందుకు మమత కుట్రలు చేస్తున్నారు: బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్

Mamata Banerjee conspiring to make West Bengal into Pakistan says Arjun Singh
  • బెంగాల్ ను మరో పాకిస్థాన్ చేసేందుకు మమత కుట్రలు పన్నుతున్నారు
  • బెంగాలీలు వెళ్లిపోతే పని మరింత సులువవుతుందని ఆమె భావిస్తున్నారు
  • బీహారీల పట్ల మమత ఎప్పుడూ వ్యతిరేక భావంతోనే వున్నారన్న ఎంపీ 
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ విరుచుకుపడ్డారు. బెంగాల్ ను మరో పాకిస్థాన్ చేసేందుకు మమత కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పశ్చిమబెంగాల్ లోని అసన్ సోల్ నగరంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నివసిస్తున్న బీహారీల పట్ల మమత ఎప్పుడూ వ్యతిరేక భావంతోనే ఉంటున్నారని అన్నారు. 

బీహార్ మనకు కార్మికులను అందించిందని అర్జున్ సింగ్ తెలిపారు. కానీ మమత ప్రభుత్వంలో రాష్ట్రంలోని పరిశ్రమలు వరుసగా మూతపడుతున్నాయని.. దీంతో బీహారీలు ఉపాధి కోల్పోతున్నారని చెప్పారు. బెంగాల్ ను మరో పాకిస్థాన్ చేసేందుకు మమత కుట్రలు చేస్తున్నారని... ఇక్కడి నుంచి బీహారీలు వెళ్లిపోతే తమ పని మరింత సులువవుతుందని మమత భావిస్తున్నారని అన్నారు. 

రాష్ట్రంలో మూతపడిన ఏ పరిశ్రమను తీసుకున్నా దాని వెనుక మమత హస్తం ఉంటుందని అర్జున్ సింగ్ ఆరోపించారు. పరిశ్రమలు మూతపడితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులందరూ ఉపాధి లేక సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతారని అన్నారు. మమత వల్ల ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
Mamata Banerjee
TMC
Arjun Singh
BJP

More Telugu News